![]() |
![]() |
.webp)
టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ గురించి అందరికీ తెలుసు. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన జర్నీని కంటిన్యూ చేస్తోంది. ఈమె ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియోలో చాలా ఘాటుగా టైం గురించి చెప్పింది. "ఎప్పుడూ మీతో మాట్లాడాలి అనుకునే వాళ్ళను, మీపై ప్రేమ చూపించే వాళ్ళను పక్కన పెట్టొద్దండి.. ఈరోజు మీ దగ్గర టైం లేకపోవచ్చు, రేపు మీ దగ్గర టైం ఉన్నప్పుడు వాళ్ళు ఉండకపోవచ్చు..అప్పుడు మీ టైంని మడిచి పెట్టుకోవాల్సిందే" అంటూ చేసిన ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.
అది ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ బాస్ షో గీతూ లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు గీతూ ఎన్నో అల్లరి పనులు చేసింది. బిగ్ బాస్ విజేత కావాలని చాలా కలలు కన్నది కానీ అవి నిజం కాకపోయేసరికి ఆమె చాలా బాధపడింది కూడా. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాక కొంతకాలం మీడియా ముందుకే రాలేదు. గీతూ సాఫ్ట్ గా ఉండుంటే ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండే అవకాశం వచ్చేదని అప్పట్లో ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఎప్పుడైతే విన్నర్ ని అనౌన్స్ చేశారో ఆ తర్వాత గీతూ నెమ్మదిగా బయటకు రావడం ఇంటర్వ్యూలో మాట్లాడ్డం చేసింది. కెరీర్ విషయం పక్కన బెడితే బిగ్ బాస్ షో ద్వారా కొన్ని వేల మందిని ఫాన్స్ గా సంపాదించుకుంది గీతూ రాయల్.
![]() |
![]() |